Queen Elizabeth 2: బ్రిటీష్ రాణి మృతికి గౌరవసూచకంగా తెలంగాణలో సంతాప దినం
- క్వీన్ ఎలిజబెత్ 2 గౌరవార్థం పలు దేశాల సంతాపం
- రేపు సంతాప దినంగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
- కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా సంతాప దినాన్ని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
బ్రిటీష్ రాణి క్వీన్ ఎలిజబెత్ 2 అస్తమయం నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలు సంతాప దినాలను పాటిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఎలిజబెత్ రాణి గౌరవార్థం ఒక రోజు సంతాప దినాన్ని పాటించాలని నిర్ణయించింది. రేపు సంతాప దినాన్ని పాటించనున్నట్టు ప్రకటించింది. రాణి మరణం నేపథ్యంలో ఈ నెల 11 (రేపు)ను సంతాప దినంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా రేపు సంతాప దినాన్ని పాటించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలను జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని సగం వరకు కిందకు దించాలని ఆదేశించారు. రేపు అధికారికంగా ఎలాంటి వేడుకలను నిర్వహించకూడదని ఆదేశాలను జారీ చేశారు.