Tricolour fly: ఎలిజబెత్-2 మరణానికి భారత్ అధికారికంగా సంతాపం వ్యక్తీకరణ
- ఆదివారం దేశవ్యాప్తంగా ఒక్కరోజు సంతాప దినం
- ఎర్రకోట, రాష్ట్రపతి భవన్ పై సగం ఎత్తులో జాతీయ పతాకం అవనతం
- ఈ నెల 8న మరణించిన రాణి ఎలిజబెత్
బ్రిటన్ రాణి ఎలిజబెత్ మరణానికి భారత్ అధికారికంగా ఆదివారం సంతాపం తెలియజేసింది. ఎర్రకోట, రాష్ట్రపతి భవన్ పై భారత జాతీయ పతాకాన్ని సగం ఎత్తులో అవనతం చేశారు. ఎలిజబెత్ కు గౌరవ సూచకంగా భారత్ ఒక్కరోజు (ఆదివారం) సంతాప దినాన్ని జరుపుకుంటుండడం గమనార్హం.
‘‘యునైటెడ్ కింగ్ డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్, నార్తర్న్ ఐర్లాండ్ రాణి ఎలిజబెత్ - 2 సెప్టెంబర్ 8న మరణించారు. మరణించిన ప్రముఖులకు గౌరవ సూచకంగా భారత ప్రభుత్వం ఒక్కరోజు సంతాప దినాన్ని సెప్టెంబర్ 11న జరుపుకోవాలని నిర్ణయించడమైనది’’అని కేంద్ర ప్రభుత్వ అధికారిక ప్రకటన తెలియజేసింది.