Bharat: భారత్ ను అదే పనిగా కీర్తిస్తున్న ట్రంప్.. వచ్చే అధ్యక్ష ఎన్నికలపై గురి

Bharat and America sabse achhe dost chants Donald Trump in leaked video

  • భారత్-అమెరికా మంచి స్నేహితులంటూ మరోసారి ప్రకటన
  • ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ
  • భారత సంతతి ప్రజల మనసు చూరగొనే యత్నం

అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత డోనాల్డ్ ట్రంప్ భారత్ ను అదే పనిగా కీర్తిస్తున్నారు. భారత్, అమెరికా గొప్ప స్నేహ దేశాలని ఆయన గుర్తు చేస్తున్నారు. తదుపరి అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి గెలిచి, రెండో సారి అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించాలన్నది ట్రంప్ యోచన. ఈ క్రమంలోనే ఆయన ఇప్పటి నుంచే భారత్ పల్లవి అందుకున్నట్టు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఎందుకంటే అమెరికాలో భారత సంతతి ప్రజలు పెద్ద సంఖ్యలో ఉన్న విషయం తెలిసిందే.

ట్రంప్ తాజాగా ఇండియా టుడేకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇది ఇంకా ప్రసారం కావాల్సి ఉంది. ‘భారత్-అమెరికా మంచి స్నేహితులు’అని ఆయన అందులో పేర్కొన్నారు. భారత్ కు తనకంటే గొప్ప ఫ్రెండ్ మరొకరు లేరని, అమెరికా అధ్యక్షుల్లోనే భారత్ కు మంచి స్నేహితుడిని తానేనంటూ ఆయన ఇప్పటికే ప్రకటించారు. మోదీకి తాను మంచి స్నేహితుడినని కూడా చెప్పారు.

నిజానికి ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మోదీతో స్నేహంగా మెలిగారు. భారత్ తో సంబంధాల బలోపేతానికి చర్యలు కూడా తీసుకున్నారు. అమెరికాలోని హూస్టన్ లో 2019లో ట్రంప్ తో పెద్ద బహిరంగ సభలో మోదీ పాలు పంచుకోగా.. అలాగే, ఆ తర్వాత ట్రంప్ సైతం 2020లో అహ్మదాబాద్ లో మోదీతో కలిసి బహిరంగ సభలో పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News