Queen Elizabeth II: బ్రిటన్ రాజ కుటుంబానికి భారీ ఆస్తులు.. మన అంబానీ, అదానీ కంటే తక్కువే
- బ్రిటన్ రాజ కుటుంబానికి సుమారు 88 బిలియన్ డాలర్ల ఆస్తులు
- 2017 నాటి గణాంకాల ఆధారంగా బ్రాండ్ ఫైనాన్స్ అంచనా
- అంబానీ, అదానీకి ఇంతకంటే ఎక్కువే ఆస్తులు
బ్రిటన్ రాణి ఎలిజబెత్ -2 మరణంతో.. బ్రిటన్ రాజ కుటుంబం గురించి ఆసక్తి ఏర్పడింది. రాజకుటుంబానికి ఎన్ని ఆస్తులు ఉండొచ్చన్న చర్చ కూడా నెట్టింట్లో నడుస్తోంది. 2017 నాటికే 88 బిలియన్ డాలర్ల ఆస్తులు కలిగి ఉన్నట్టు ‘బ్రాండ్ ఫైనాన్స్’ అనే బ్రాండ్ వ్యాల్యూషన్ సంస్థ అంచనా. ఎలిజబెత్ వ్యక్తిగత ఆస్తుల విలువ 2021 నాటికి 500 మిలియన్ డాలర్లు ఉంటాయని ఫోర్బ్స్ సంస్థ తెలిపింది. ఇప్పుడు ఈ ఆస్తులన్నింటికీ వారసుడు కింగ్ చార్లెస్ అవుతారు.
ఈ ప్రకారం మన దేశ కుబేరుల కంటే బ్రిటన్ రాజ కుటుంబం ఆస్తులు తక్కువే ఉన్నట్టు తెలుస్తోంది. ఫోర్బ్స్ బిలియనీర్స్ తాజా జాబితా ప్రకారం అదానీ గ్రూపు చీఫ్ గౌతమ్ అదానీ నెట్ వర్త్ విలువ 148.6 బిలియన్ డాలర్లు. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ సంపద విలువ 93.9 బిలియన్ డాలర్లుగా ఉంది.