Pakistan: ఆసియా కప్ ఫైనల్... శ్రీలంకపై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాకిస్థాన్
- దుబాయ్ లో మ్యాచ్
- టైటిల్ కోసం పాక్, శ్రీలంక జట్ల సమాయత్తం
- హ్యాట్రిక్ విజయాలతో ఫైనల్ చేరిన శ్రీలంక
- సూపర్-4లో పాక్ పైనా విజయం
- ఆత్మవిశ్వాసంతో ఉన్న లంక ఆటగాళ్లు
ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్, శ్రీలంక జట్లు తలపడనున్నాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం ఈ టైటిల్ పోరుకు వేదికగా నిలుస్తోంది. ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. సూపర్-4 దశలో హ్యాట్రిక్ విజయాలతో ఊపుమీదున్న శ్రీలంక జట్టు టైటిల్ పై కన్నేసింది. చివరి లీగ్ మ్యాచ్ లో పాకిస్థాన్ పై భారీ విజయం సాధించడం శ్రీలంక ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఇవాళ్టి ఫైనల్లోనూ అదే ఆటతీరు కనబర్చాలని లంకేయులు భావిస్తున్నారు.
ఇక, పాకిస్థాన్ జట్టును తక్కువగా అంచనా వేయడం ఎప్పుడూ ప్రమాదకరమే. ఆ జట్టులో అనూహ్యరీతిలో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేయగల ఆటగాళ్లకు కొదవలేదు. సూపర్-4 దశలో శ్రీలంక చేతిలో ఎదురైన పరాజయం నుంచి పాక్ పాఠాలు నేర్చుకుని ఉంటుందనడంలో సందేహంలేదు. ఇటీవల విఫలమవుతున్న కెప్టెన్ బాబర్ అజామ్ ఈ మ్యాచ్ లో బ్యాట్ ఝుళిపిస్తాడని పాక్ ఆశిస్తోంది.
పాకిస్థాన్ జట్టు...
బాబర్ అజామ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), ఫకార్ జమాన్, ఇఫ్తికార్ అహ్మద్, కుష్దిల్ షా, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, ఆసిఫ్ అలీ, హరీస్ రవూఫ్, నసీమ్ షా, మహ్మద్ హస్నైన్.
దసున్ షనక (కెప్టెన్), పత్తుమ్ నిస్సాంక, కుశాల్ మెండిస్ (వికెట్ కీపర్), ధనుష్క గుణతిలక, ధనంజయ డిసిల్వ, భానుక రాజపక్స, వనిందు హసరంగ, చామిక కరుణరత్నే, ప్రమోద్ మధుషాన్, మహీశ్ తీక్షణ, దిల్షన్ మధుశంక.