Jayaprada: కృష్ణంరాజు గురించి మాట్లాడుతూ ఏడ్చేసిన జయప్రద.. వీడియో ఇదిగో!

Jaya Prada gets emotional while speaking about Krishnam Raju
  • కృష్ణంరాజుకు నివాళి అర్పించిన జయప్రద
  • ఆయన ఎంతో మంచి మనిషి అని ప్రశంస
  •  ఎప్పుడు కనిపించినా... జయప్రద ఎలా ఉన్నావ్? అని అడిగేవారని వ్యాఖ్య
రెబల్ స్టార్ కృష్ణంరాజు పార్థివ దేహానికి సీనియర్ నటి, బీజేపీ నాయకురాలు జయప్రద నివాళి అర్పించారు. జూబ్లీహిల్స్ లోని కృష్ణంరాజు నివాసానికి వెళ్లి అంజలి ఘటించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మాట్లాడుతూనే ఆమె ఏడ్చేశారు. కృష్ణంరాజు ఎంతో మంచి మనిషి అని జయప్రద ఈ సందర్భంగా చెప్పారు. ఆయనతో కలిసి నటించే అద్భుతమైన అవకాశాన్ని భగవంతుడు తనకు ఇచ్చాడని అన్నారు. తాను ఎప్పుడు కనిపించినా... జయప్రద ఎలా ఉన్నావ్? అని అడిగేవారని చెప్పారు. కృష్ణంరాజు పిల్లలు చాలా చిన్న వారని... ఈ బాధను తట్టుకుని నిలబడే ధైర్యాన్ని వారి పిల్లలకు, వారి సతీమణికి ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు. జయప్రద, కృష్ణంరాజు పలు చిత్రాల్లో కలిసి నటించారు. 
Jayaprada
Krishnam Raju
Tollywood

More Telugu News