Thopudurthi Prakash Reddy: నేను ప్రమాణం చేస్తా.. మీరు కూడా చేస్తారా?: పరిటాల కుటుంబానికి తోపుదుర్తి సవాల్

Thopudurthi Prakash Reddy fires on Paritala Sriram

  • కాంట్రాక్టర్ ను డబ్బులు అడిగానని అసత్య ప్రచారాలు చేస్తున్నారన్న తోపుదుర్తి
  • కాణిపాకంలో ప్రమాణం చేస్తానని సవాల్
  • కావాలంటే సీబీఐతో విచారణ జరుపుకోవచ్చని వ్యాఖ్య

కాంట్రాక్టర్ ను డబ్బులు అడిగానంటూ తనపై పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని వైసీపీ రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి మండిపడ్డారు. కావాలంటే కాణిపాకంలో తాను ప్రమాణం చేస్తానని చెప్పారు. తాను డబ్బులు అడిగానని చెపుతున్న వారు కూడా ప్రమాణం చేస్తారా? అని సవాల్ విసిరారు. తనపై చేస్తున్న ఆరోపణలకు కావాలంటే సీబీఐతో కూడా విచారణ జరుపుకోవచ్చని అన్నారు. పరిటాల శ్రీరామ్ దౌర్జన్యాలు చేస్తానంటే కుదరదని చెప్పారు. గన్ మెన్లు లేకుండా శ్రీరామ్ బయటకు రాగలరా? అని ప్రశ్నించారు. క్రిమినల్స్ కు షెల్టర్ ఇచ్చే సంస్కృతి పరిటాల కుటుంబానిదని అన్నారు. పోలీసులు నిజాయతీగా పని చేయడం వారికి నచ్చదని విమర్శించారు.

  • Loading...

More Telugu News