Ram: రామ్ తో బోయపాటి సెట్స్ పైకి వెళ్లేది ఈ నెలలోనే!
- రామ్ నెక్స్ట్ మూవీ బోయపాటితో
- ఈ నెల 25 నుంచి రెగ్యులర్ షూటింగ్
- ద్విపాత్రాభినయం చేయనున్న రామ్
- త్వరలో పూర్తికానున్న హీరోయిన్స్ ఎంపిక
రామ్ తన తాజా చిత్రాన్ని బోయపాటితో చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా పూజా కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుని చాలాకాలమైంది. దాంతో రెగ్యులర్ షూటింగు ఎప్పుడు మొదలవుతుందా అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందనే టాక్ బలంగా వినిపిస్తోంది.
బోయపాటి దర్శకత్వం వహించే ఈ సినిమా యాక్షన్ తో కూడిన పొలిటికల్ డ్రామాను టచ్ చేస్తూ నడిచే ఫ్యామిలీ ఎంటర్టయినర్ అని అంటున్నారు. ఈ సినిమాలో రామ్ ద్విపాత్రాభినయం చేయనున్నాడు. ఇందులోని ఒక పాత్ర కేరళ నేపథ్యంలో కనిపిస్తుందట. ఆ పాత్రను బోయపాటి డిజైన్ చేసిన తీరు చాలా డిఫరెంట్ గా ఉంటుందని చెబుతున్నారు.
ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలకు చోటు ఉండనుంది. అయితే ఇంతవరకూ ఎవరినీ ఎంపిక చేయలేదు. త్వరలోనే కథానాయికల ఎంపిక పూర్తవుతుందని అంటున్నారు. శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాకి నిర్మాతగా ఉన్నారు. 'అఖండ' హిట్ తరువాత బోయపాటి చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉండనున్నాయి.