Andhra Pradesh: మరో రూ.1,000 కోట్ల రుణం తీసుకున్న ఏపీ ప్రభుత్వం
- ఆర్బీఐలో బాండ్ల వేలం ద్వారా తాజా రుణం సేకరణ
- 18, 20 ఏళ్ల కాల వ్యవధులతో రూ.500 కోట్ల చొప్పున రుణం
- 7.45 శాతం వడ్డీకి తాజా రుణాన్ని సేకరించిన రాష్ట్ర ప్రభుత్వం
ఏపీ ప్రభుత్వం మంగళవారం మరో రూ.1,000 కోట్ల రుణం తీసుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్వహించిన సెక్యూరిటీ బాండ్ల వేలంలో ఏపీ ప్రభుత్వం ఈ రుణాన్ని సేకరించింది. ఈ రుణంలో రూ.55 కోట్లను 18 ఏళ్ల కాల వ్యవధికి 7.45 శాతం వడ్డీకి తీసుకున్న ఏపీ ప్రభుత్వం... మరో రూ.500 కోట్లను 20 ఏళ్ల కాల వ్యవధికి 7.45 శాతం వడ్డీకి సేకరించింది. ఈ కొత్త రుణంతో ఏపీ ఈ ఏడాదిలో ఇప్పటిదాకా రూ.48,608 కోట్ల రుణాలను తీసుకున్నట్టయింది. ఈ ఏడాదిలో కేంద్రం విధించిన ఎఫ్ఆర్బీఎం రూ.48000 కోట్లు కాగా... తాజా రుణంతో ఏపీ ప్రభుత్వం ఆ పరిమితిని దాటేసింది.