Shirdi: షిర్డీ సాయిబాబా సంస్థాన్ ధర్మకర్తల బోర్డును రద్దు చేసిన హైకోర్టు బెంచ్
- మహా వికాస్ అఘాడీ ప్రభుత్వ హయాంలో బోర్డు నియామకం
- నిబంధనల మేరకు బోర్డును నియమించలేదని పిటిషన్లు
- 8 వారాల్లోగా కొత్త బోర్డును నియమించాలని హైకోర్టు బెంచ్ ఆదేశం
ప్రఖ్యాత షిర్డీ సాయిబాబా ఆలయానికి చెందిన ధర్మకర్తల బోర్డును బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ రద్దు చేసింది. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వ హయాంలో ఈ బోర్డును నియమించారు. మరోవైపు వచ్చే 8 వారాల్లోగా కొత్త ధర్మకర్తల మండలిని నియమించాలని హైకోర్టు బెంచ్ ఆదేశించింది.
నిబంధనల మేరకు ధర్మకర్తల మండలిని నియమించలేదని ఆరోపిస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. తొలుత ఎన్సీపీ ఎమ్మెల్యే అశుతోష్ కాలేను బోర్డు అధ్యక్షుడిగా నియమించి, మరికొందరిని ట్రస్ట్ సభ్యులను చేశారని పిటిషన్ దారులు తమ పిటిషన్లలో పేర్కొన్నారు. ఈ పిటిషన్లను విచారించిన ఔరంగాబాద్ బెంచ్ ఈరోజు తీర్పును వెలువరించింది.