Hyderabad: హైదరాబాద్‌లో అమెరికా కాన్సుల్ జనరల్‌గా జెన్నిఫర్ లార్సన్ బాధ్యతల స్వీకారం
- ఇటీవలే హైదరాబాద్ కాన్సులేట్ జనరల్‌గా నియమితులైన జెన్నిఫర్
- మంగళవారం బాధ్యతలు స్వీకరించిన వైనం
- తెలంగాణ, ఏపీ, ఒడిశా వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న కార్యాలయం
అగ్ర రాజ్యం అమెరికాకు చెందిన హైదరాబాద్ కార్యాలయం (యూఎస్ కాన్సులేట్ జనరల్ ఆఫీస్) చీఫ్‌గా జెన్నిఫర్ లార్సన్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆమె మంగళవారం హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమెకు కార్యాలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న యూఎస్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు సంబంధించి అమెరికా దౌత్య కార్యకలాపాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.