AP Assembly Session: 'భ‌ర‌త్ ద గ్రేట్' అన్న జ‌గ‌న్‌!... ఉప్పొంగిపోయిన కుప్పం వైసీపీ ఇంచార్జీ!

ap cm ys jagan appreciates mlc krj bharath in assembly loddies
  • గురువారం ప్రారంభ‌మైన ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు
  • జ‌గ‌న్‌ను క‌లిసేందుకు ఆస‌క్తి చూపిన వైసీపీ స‌భ్యులు
  • జ‌గ‌న్‌ను క‌లిసిన కుప్పం వైసీపీ ఇంచార్జీ భ‌ర‌త్‌
  • బాగా ప‌నిచేస్తున్నారంటూ భ‌ర‌త్‌ను అభినందించిన జ‌గ‌న్‌
ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం అయిన తొలి రోజున అసెంబ్లీ లాబీల్లో ఓ ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటుచేసుకుంది. శాస‌న‌స‌భా స‌మావేశాల కోసం అసెంబ్లీకి వ‌స్తున్న జ‌గ‌న్‌ను క‌లిసేందుకు అధికార పార్టీ వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆస‌క్తి చూపారు. ఈ సంద‌ర్భంగా కుప్పం వైసీపీ ఇంచార్జీగా ఉన్న ఎమ్మెల్సీ కేఆర్‌జే భ‌ర‌త్.. జ‌గ‌న్‌ను క‌లవ‌గ‌లిగారు. 

ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ను జ‌గ‌న్ 'భ‌ర‌త్ ద గ్రేట్' అంటూ సంబోధించార‌ట‌. అంతేకాకుండా బాగా ప‌నిచేస్తున్నారంటూ భ‌ర‌త్‌ను భుజం త‌ట్టిన జ‌గ‌న్ మ‌రింత‌గా ప్రోత్స‌హించారు. ఈ స‌న్నివేశాన్ని గుర్తు చేసుకుంటూ జ‌గ‌న్ త‌న భుజాన్ని త‌డుతున్న చిత్రాన్ని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన భ‌ర‌త్‌... జ‌గ‌న్ త‌న‌కు ఇచ్చిన ప్ర‌శంస‌ను కూడా ప్ర‌స్తావించారు. జగనన్న అభినందించడం సంతోషంగా ఉంది అంటూ భ‌రత్ ఉప్పొంగిపోయారు.
AP Assembly Session
YSRCP
YS Jagan
Kuppam
KRJ Bharath

More Telugu News