Vladimir Putin: పుతిన్ తో భేటీ సందర్భంగా చాలా ఇబ్బంది పడ్డ పాక్ ప్రధాని.. వీడియో ఇదిగో!
- ఉజ్బెకిస్థాన్ లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సమావేశం
- పుతిన్ తో సమావేశమైన పాక్ ప్రధాని షరీఫ్
- ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడంలో ఇబ్బంది పడ్డ పాక్ పీఎం
ఉజ్బెకిస్థాన్ లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ) శిఖరాగ్ర సమావేశం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో పాకిస్థాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పాక్ ప్రధాని అవస్థలు పడ్డారు.
చర్చలు ప్రారంభించడానికి ముందు పుతిన్ తన చెవిలో ఇయర్ ఫోన్స్ వంటి పరికరాన్ని పెట్టుకున్నారు. అయితే ఆ పరికరాన్ని పెట్టుకోవడానికి షరీఫ్ మాత్రం చాలా ఇబ్బంది పడ్డారు. ఎవరైనా వచ్చి సహాయం చేయండని తన సిబ్బందిని పిలిచారు. సహాయకుడు వచ్చి పరికరాన్ని అమర్చారు. కానీ వెంటనే పరికరం ఊడి పడిపోయింది. దీంతో సహాయకుడు మరోసారి వచ్చి పరికరాన్ని అమర్చారు.
మరోవైపు, షరీఫ్ ఇబ్బందిని గమనిస్తున్న పుతిన్ చిరునవ్వులు చిందిస్తూ ఉండిపోయారు. ఇంకోవైపు, షరీఫ్ పై పాక్ లోని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అంతర్జాతీయ వేదికపై దేశ పరువు తీశారంటూ మండిపడుతున్నాయి.