Tejashwi Yadav: తేజస్వి యాదవ్‌‌కు బెయిల్ రద్దు చేయాలంటూ హైకోర్టుకు వెళ్లిన సీబీఐ

CBI asks Delhi High Court to cancel Tejashwi Yadav balil

  • ఐఆర్సీటీసీ కుంభకోణంలో తేజస్విపై కేసు
  • మీడియా సమావేశంలో తమ అధికారులను బెదిరించేలా మాట్లాడారన్న సీబీఐ
  • 2018 ఆగస్టులో తేజస్వికి బెయిల్ ఇచ్చిన కోర్టు

రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) కుంభకోణం కేసులో బీహార్ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ కీలకనేత తేజస్వి యాదవ్ కు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని ఢిల్లీ హైకోర్టును సీబీఐ కోరింది. ఇటీవల జరిగిన ఓ మీడియా సమావేశంలో తమ అధికారులను బెదిరించేలా తేజస్వి మాట్లాడారని కోర్టుకు సీబీఐ తెలిపింది. ఈ నేపథ్యంలో తేజస్వికి ప్రత్యేక న్యాయమూర్తి గీతాంజలి గోయెల్ నోటీసులు పంపారు. 

హోటల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ కు సంబంధించిన ఈ కేసులో 12 మంది వ్యక్తులు, రెండు కంపెనీలపై సీబీఐ కేసు నమోదు చేసింది. 2006లో రాంచీ, పూరీలో ఐఆర్సీటీసీ హోటల్స్ కాంట్రాక్ట్ లో అవకతవకలు జరిగాయని సీబీఐ ఆరోపిస్తోంది. ఈ కేసులో 2018 ఆగస్టులో తేజస్వి యాదవ్, ఆయన తల్లి రబ్రీదేవిలకు బెయిల్ మంజూరయింది. ఇదే కేసులో ఈడీ కూడా మనీలాండరింగ్ ఆరోపణలతో ఛార్జిషీట్ నమోదు చేసింది.

  • Loading...

More Telugu News