Joe Biden: తైవాన్ పై దాడి జరిగితే అమెరికా రంగంలోకి దిగడం తథ్యం: చైనాకు బైడెన్ హెచ్చరిక

US president Biden says if any attack happened on Taiwan America comes to defend the island nation

  • తైవాన్ అంశంలో అమెరికా, చైనా మధ్య ముదురుతున్న వైరం 
  • తైవాన్ పై చైనా దాడి చేసే అవకాశాలు
  • అదే జరిగితే పూర్తిస్థాయి సైనిక మద్దతు ఇస్తామన్న బైడెన్

తైవాన్ కేంద్రబిందువుగా అమెరికా, చైనా మధ్య వైరం మరింత ముదురుతోంది. తైవాన్ పై దాడి చేస్తే అమెరికా రంగంలోకి దిగడం తథ్యమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చైనాను హెచ్చరించారు. ఉక్రెయిన్ లాగా కాకుండా, పూర్తిస్థాయిలో తైవాన్ కు సైనిక రక్షణ కల్పిస్తామని ఉద్ఘాటించారు. తైవాన్ విషయంలో తమ వైఖరి ఇదేనని తేల్చిచెప్పారు. 

వైట్ హౌస్ అధికార ప్రతినిధి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. తైవాన్ పట్ల అమెరికా విధానంలో ఎలాంటి మార్పు లేదని అన్నారు. అటు, బైడెన్ వ్యాఖ్యల పట్ల తైవాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. తైవాన్ కు భద్రతాపరమైన భరోసా అందించే విషయంలో తిరుగులేని దృక్పథాన్ని ప్రదర్శించిన బైడెన్ కు తైవాన్ విదేశాంగ శాఖ కృతజ్ఞతలు తెలిపింది. 

ఇటీవల అమెరికా చట్టసభ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ లో పర్యటించగా, చైనా అగ్గిమీద గుగ్గిలం అయింది. తైవాన్ చుట్టూ సైనిక విన్యాసాలు చేపట్టి ఆ చిన్న దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేసే ప్రయత్నం చేసింది.

  • Loading...

More Telugu News