Telangana: మ్యాచ్‌ను ప్ర‌త్య‌క్షంగా వీక్షించాలంటూ తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌కు అజారుద్దీన్‌ ఆహ్వానం

hca president Mohammed Azharuddin invited ts governor for the team inida and australia t20 match
  • ఉప్ప‌ల్‌లో టీమిండియాతో 25న ఆస్ట్రేలియా మ్యాచ్‌
  • హెచ్‌సీఏ అధ్య‌క్షుడి హోదాలో ఆహ్వానించిన వైనం
  • ట్విట్టర్లో ఈ విషయాన్ని పంచుకున్న గవర్నర్ 
తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర రాజ‌న్‌కు సోమ‌వారం ఓ అరుదైన ఆహ్వానం అందింది. ఈ నెల 25న న‌గ‌రంలోని ఉప్ప‌ల్ స్టేడియంలో జ‌ర‌గ‌నున్న భార‌త్‌, ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్‌ను ప్ర‌త్య‌క్షంగా వీక్షించాలంటూ ఆ ఆహ్వానం అందింది. టీమిండియా మాజీ కెప్టెన్‌, కాంగ్రెస్ నేత మ‌హ్మ‌ద్ అజారుద్దీన్ స్వ‌యంగా ఈ ఆహ్వానాన్ని ఆమెకు అందించారు. 

త‌న‌కు అందిన ఆహ్వానాన్ని ట్విట్టర్ వేదికగా గవర్నర్ పంచుకున్నారు. భార‌త్‌లో ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా 3 టీ20 మ్యాచ్‌ల‌తో కూడిన సిరీస్‌లో మూడో మ్యాచ్ ఉప్ప‌ల్ స్టేడియంలో నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ్యాచ్‌ను ప్ర‌త్య‌క్షంగా వీక్షించాలంటూ హెచ్‌సీఏ స‌భ్యుల‌తో కలిసి త‌మిళిసైని అజార్ ఆహ్వానించారు.
Telangana
Hyderabad
Uppal Cricket Stadium
TS Governor
Tamilisai Soundararajan
Congress
Mohammed Azharuddin
Team New Zealand
Australia
T20 Match
HCA

More Telugu News