Vidadala Rajini: ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. చిన్నారి సంధ్య మృతిని టీడీపీ రాజకీయం చేస్తోందన్న మంత్రి రజని

TDP politicising Sandhyas death says Vidadala Rajini

  • ఏడు బిల్లులను సభలో ప్రవేశపెట్టిన ఏపీ ప్రభుత్వం
  • విష జ్వరాల కట్టడికి పటిష్ఠ చర్యలను తీసుకున్నామన్న రజని
  • మలేరియా, డెంగీలను ఆరోగ్యశ్రీ కిందకు తీసుకొచ్చామని వ్యాఖ్య

నాలుగో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు సమావేశాల్లో భాగంగా ఏడు బిల్లులను ఏపీ ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది. విద్య, వైద్యం, నాడు-నేడుపై ఈరోజు స్వల్పకాలిక చర్చ జరగనుంది. శాసనసభ ముందుకు పెగాసెస్ నివేదిక కూడా రానుంది. 

వైద్యానికి సంబంధించిన విషయంపై మంత్రి విడదల రజని మాట్లాడుతూ... విష జ్వరాల కట్టడికి పటిష్ఠ చర్యలను తీసుకున్నామని చెప్పారు. ఇందుకోసం జిల్లా స్థాయిలో ప్రత్యేక అధికారులను నియమించామని తెలిపారు. ఆరోగ్య శ్రీ పథకాన్ని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో వ్యాధులను ఆరోగ్యశ్రీలో చేర్చామని చెప్పారు. మలేరియా, డెంగీ జ్వరాలను కూడా ఆరోగ్యశ్రీ కిందకు తీసుకొచ్చామని తెలిపారు. 

గత ప్రభుత్వం దోమలపై దండయాత్ర పేరుతో డబ్బులను దుర్వినియోగం చేసిందని రజని విమర్శించారు. వైరల్ వ్యాధితో చిన్నారి సంధ్య మృతి చెందడం బాధాకరమని... ఈ అంశాన్ని టీడీపీ సభ్యులు రాజకీయం చేయడం దారుణమని అన్నారు. ప్రభుత్వంపై బుదర చల్లే కార్యక్రమాన్ని టీడీపీ చేస్తోందని మంత్రి మండిపడ్డారు.

  • Loading...

More Telugu News