Anil Goyal: మోదీ అంటే వాళ్లకు ఇష్టమట.. ఫ్రాన్స్ లో ఓ గుజరాతీ పర్యాటకుడికి ఉచితంగా వైద్యం !

Free treatment to Indian tourist in Paris after knowing he was came from Modi state Gujarath

  • కుటుంబంతో కలిసి యూరప్ వెళ్లిన గోయల్ అనే వ్యక్తి
  • గుజరాతీయుడైన గోయల్ పారిస్ లో పర్యటిస్తుండగా తీవ్ర అస్వస్థత
  • ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు
  • గోయల్ గుజరాత్ కు చెందినవాడని తెలుసుకున్న ఆసుపత్రి సిబ్బంది
  • మోదీ స్వరాష్ట్రానికి చెందినవాడంటూ ఉచితంగా ఖరీదైన వైద్యం

ఎమర్జెన్సీ కేసులకు చికిత్స అందించేందుకు ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎంత ఖర్చవుతుందో తెలిసిందే. ఏ దేశంలో అయినా ప్రైవేటు ఆసుపత్రులతో వ్యవహారం అంటే డబ్బుతో కూడుకున్నదే. కానీ ఈ భారత పర్యాటకుడికి మాత్రం ఫ్రాన్స్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఉచితంగా వైద్యం అందింది. అలాగని అతడికేమీ అంతర్జాతీయ ఆరోగ్య బీమా పథకాలేవీ లేవు. 

అసలేం జరిగిందంటే... గుజరాత్ లోని వడోదరకు చెందిన అనిల్ గోయల్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి యూరప్ టూర్ వెళ్లారు. విహారయాత్రలో భాగంగా అనిల్ గోయల్ ఫ్రాన్స్ కూడా వెళ్లారు. అయితే పారిస్ లో పర్యటిస్తుండగా ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దాంతో కుటుంబ సభ్యులు ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించారు. 

ఆసుపత్రి సిబ్బంది అతడికి ఐసీయూలో చికిత్స అందించారు. కాగా, అనిల్ గోయల్ గుజరాత్ రాష్ట్రానికి చెందినవాడని ఆసుపత్రి సిబ్బంది తెలుసుకున్నారు. గుజరాత్ అంటే భారత ప్రధాని నరేంద్ర మోదీకి చెందిన రాష్ట్రం అని వారు గుర్తించారు. 

ఆ ఆసుపత్రి సిబ్బంది, యాజమాన్యం దృష్టిలో మోదీ అంటే ఓ గొప్ప ప్రపంచస్థాయి నేత. ఇంకేముందీ, మోదీకి చెందిన రాష్ట్రం నుంచి వచ్చిన అనిల్ గోయల్ వారికి ఓ వీఐపీ అయిపోయాడు. తమ ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాలన్నింటిని గోయల్ కు అందించారు. అత్యంత ఖరీదైన వైద్యం చేసి అతడ్ని మామూలు మనిషిని చేశారు. అంతేకాదు, లక్షల్లో ఉన్న అతడి ఆసుపత్రి బిల్లును కూడా మాఫీ చేశారు. అంతా మోదీ-గుజరాత్ మహిమ!

ఇక అనిల్ గోయల్ కు, అతడి కుటుంబ సభ్యులకు ఇదొక అద్భుతమే అయింది. ఊహించని రీతిలో లభించిన ఈ వీఐపీ ట్రీట్ మెంట్ వారిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది.

  • Loading...

More Telugu News