Kalva Srinivasulu: పేరు మార్చకపోతే చరిత్ర కూడా జగన్ ను క్షమించదు!: కాల్వ శ్రీనివాసులు
- ఎన్టీఆర్ యూనివర్శిటీ పేరును మార్చిన వైసీపీ ప్రభుత్వం
- సీఎం జగన్ పై మండిపడిన కాల్వ శ్రీనివాసులు
- యూనివర్శిటీ పెట్టిన సమయంలో వైఎస్సార్ ఎక్కడున్నారని ప్రశ్నించిన కాల్వ
ఏపీలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చి... దానికి వైఎస్సార్ పేరును పెట్టేందుకు ఏపీ అసెంబ్లీ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ పై మండిపడ్డారు. హెల్త్ యూనివర్శిటీ పెట్టిన సమయంలో రాజశేఖరరెడ్డి ఎక్కడున్నారని ఆయన ప్రశ్నించారు. పేరు మార్చకపోతే చరిత్ర కూడా జగన్ ను క్షమించదని చెప్పారు.