Telangana: షబ్బీర్ అలీని పార్టీ నుంచి సస్పెండ్ చేయండి... ప్రియాంక గాంధీకి కోమటిరెడ్డి లేఖ
- షబ్బీర్ కు పలు కేసులతో సంబంధం ఉందన్న వెంకట్ రెడ్డి
- ఏ క్షణమైనా ఆయన అరెస్ట్ అయ్యే అవకాశముందని ఫిర్యాదు
- షబ్బీర్ వల్ల పార్టీకి నష్టం జరిగే ప్రమాదముందని హెచ్చరిక
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గురువారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీకి ఓ లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన ఓ కీలక అంశాన్ని ప్రస్తావించారు. పార్టీలో సీనియర్ నేతగా కొనసాగుతున్న షబ్బీర్ అలీని తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆయన ప్రియాంకా గాంధీని కోరారు. ఇందుకు గల కారణాలను కూడా ఆయన తన లేఖలో వివరించడం గమనార్హం.