Hyderabad: మెట్రో పిల్లర్లపై రాజకీయ ప్రకటనలు అంటిస్తే జరిమానాతో పాటు జైలు శిక్ష
- మెట్రో పిల్లర్లపై రాజకీయ నేతల పోస్టర్లు అంటించరాదన్న మెట్రో ఎండీ
- నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
- రూ.1,000 జరిమానాతో పాటు 6 నెలల జైలు శిక్షకు గురవుతారన్న ఎండీ
హైదరాబాద్ నగరంలో వ్యాపార ప్రకటనలపై ఆంక్షలు అమలవుతున్న సంగతి తెలిసిందే. నగరంలోని ప్రధాన కూడళ్లతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలో హోర్డింగ్ లకే ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదు. ఇలాంటి నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైల్ స్టేషన్లు, మెట్రో పిల్లర్లు ఇప్పుడు వాణిజ్య ప్రకటనలకు కేంద్రంగా మారాయి. ఈ విషయంలోనూ నిబంధనలను పక్కాగానే పాటించాలని, ఏమాత్రం నిబంధనలు అతిక్రమించినా చర్యలు తప్పవని హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి హెచ్చరించారు.