VV Lakshminarayana: పేరు మార్పు కాదు.. వ్యవస్ధల రిపేరు కావాలి: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
- ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరును మార్చిన వైసీపీ సర్కారు
- తమిళనాడు రాజకీయాలతో పోలుస్తూ వైసీపీ నిర్ణయాన్ని తప్పుబట్టిన సీబీఐ మాజీ జేడీ
- జయలలిత బొమ్మలున్న స్కూల్ బ్యాగులను స్టాలిన్ పంచారని గుర్తు చేసిన వైనం
ఏపీలోని వైసీపీ సర్కారు విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరును మార్చిన వైనంపై సీబీఐ మాజీ జేడీ, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వి వి లక్ష్మీనారాయణ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తమిళనాడులో అన్నాడీఎంకే ప్రభుత్వం దిగిపోయి... డీఎంకే ప్రభుత్వ పాలన అమలయ్యాక చోటుచేసుకున్న ఘటనలను గుర్తు చేస్తూ ఆయన ఏపీ సర్కారు తీరును విమర్శించారు.