BJP: ఎన్టీఆర్ ను అవమానించినట్టే.. హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై పురందేశ్వరి
- ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పిడిపై స్పందించిన పురందేశ్వరి
- ఎన్టీఆర్ పై అపార గౌరవం ఉందంటూనే ఆయన పేరు మార్చేస్తారా? అని ప్రశ్న
- స్వలాభాపేక్ష లేకుండా హెల్త్ వర్సిటీని ఏర్పాటు చేశారన్న బీజేపీ నేత
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మారుస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై దాదాపుగా అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఎన్టీఆర్ తనయ, కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత దగ్గుబాటి పురందేశ్వరి గురువారం స్పందించారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీలో నుంచి ఎన్టీఆర్ పేరును తీసి వేయడం అంటే.. ఎన్టీఆర్ ను అవమానించినట్టేనని ఆమె అభిప్రాయపడ్డారు.