Team India: ఉప్పల్ టీ20 మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా

Team India won the toss in Uppal T20

  • టీమిండియా, ఆసీస్ జట్ల మధ్య మూడో టీ20
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
  • మళ్లీ జట్టులోకి వచ్చిన భువీ
  • పంత్ ను పక్కనబెట్టామన్న రోహిత్ శర్మ
  • మ్యాచ్ ను గెలిచిన జట్టుకు సిరీస్ కైవసం

టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ కు సర్వం సిద్ధమైంది. హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ సిరీస్ లో భారత్, ఆసీస్ చెరో మ్యాచ్ నెగ్గి 1-1తో సమవుజ్జీలుగా ఉన్నాయి. నేటి మ్యాచ్ లో నెగ్గిన జట్టు సిరీస్ విజేతగా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో, ఉప్పల్ మైదానంలో హోరాహోరీ తప్పదనిపిస్తోంది.

టాస్ సందర్భంగా రోహిత్ శర్మ మాట్లాడుతూ, హైదరాబాదులో ప్రేక్షకుల నడుమ ఆడనుండడం ఎంతో ఉత్సాహాన్నిస్తోందని తెలిపాడు. నాగ్ పూర్ లో విజయవంతమైన లక్ష్యఛేదన జట్టులో ఉత్తేజాన్ని నింపిందని, ఇక్కడా అదే ఒరవడి కొనసాగిస్తామని చెప్పాడు. గత మ్యాచ్ లో ఆడని భువనేశ్వర్ కుమార్ మళ్లీ జట్టులోకి వచ్చాడని, రిషబ్ పంత్ ఈ మ్యాచ్ లో ఆడడంలేదని రోహిత్ శర్మ వెల్లడించాడు. 

ఇక, ఆసీస్ సారథి ఆరోన్ ఫించ్ స్పందిస్తూ, టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ తీసుకునేవాళ్లమని తెలిపాడు. నేటి మ్యాచ్ లో జోష్ ఇంగ్లిస్ ఆడుతున్నాడని, షాన్ అబ్బాట్ ను జట్టు నుంచి తప్పించామని వెల్లడించాడు.

టీమిండియా...
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, యజువేంద్ర చహల్.

ఆస్ట్రేలియా...
ఆరోన్ ఫించ్ (కెప్టెన్), కామెరాన్ గ్రీన్, స్టీవెన్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్ వెల్, మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్),  టిమ్ డేవిడ్, జోష్ ఇంగ్లిస్, డేనియల్ సామ్స్, పాట్ కమిన్స్, ఆడమ్ జంపా, జోష్ హేజెల్ వుడ్.

  • Loading...

More Telugu News