Zerodha: వర్క్ ఫ్రం హోం ఉద్యోగుల ఆరోగ్యంపై శ్రద్ధ.. బరువు తగ్గితే రూ. 10 లక్షలు ఇస్తామని ప్రకటించిన ‘జెరోధా’

Zerodha CEO sets fitness challenge for employees offers one months salary as prize

  • రోజుకు 350 కేలరీల కొవ్వును కరిగించుకోవాలని సూచన
  • నిర్దేశిత కాలపరిమితిలో బరువు తగ్గితే బోనస్‌గా నెల రోజుల వేతనం
  • బరువు తగ్గిన వారిలో లక్కీ డ్రా తీసి రూ. 10 లక్షలు ఇస్తామని ప్రకటన

ఇంటి నుంచి పనిచేస్తున్న ఉద్యోగుల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టిన ఓ సంస్థ వారికి బ్రహ్మాండమైన ఆఫర్ ప్రకటించింది. వర్క్ ఫ్రం హోం చేస్తున్న ఉద్యోగులు బరువు పెరిగి అనారోగ్యం బారినపడుతున్నట్టు పలు అధ్యయనాలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో తమ ఉద్యోగులు ఆరోగ్యంగా ఉండాలని, ఎలాంటి అనారోగ్య సమస్యలు వారి దరి చేరకూడదని భావించిన ఆన్‌లైన్ బ్రోకరేజీ సంస్థ జెరోధా ఉద్యోగుల కళ్లలో సంతోషం నింపే ప్రకటన చేసింది. బరువు తగ్గించుకునే ఉద్యోగులకు రూ. 10 లక్షలు ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ సీఈవో నితిన్ కామత్ తెలిపారు.

రోజుకు 350 కేలరీల కొవ్వును కరిగించుకున్న ఉద్యోగులకు వివిధ రకాల ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్టు తెలిపారు. తమ ఫిట్‌నెస్ ట్రాకర్ పరికరాల్లో ఉద్యోగులు రోజువారీగా ఎంత కొవ్వును కరిగించాల్సి ఉంటుందన్న పరిధిని ఏర్పాటు చేస్తామన్నారు. నిర్దేశిత కాలపరిమితిలో లక్ష్యాన్ని చేరుకున్న వారికి నెల రోజుల వేతనాన్ని బోనస్‌గా అందిస్తామన్నారు. అలా బరువు తగ్గిన ఉద్యోగుల మధ్య లక్కీ డ్రా నిర్వహించి రూ.10 లక్షల బహుమతిని అందిస్తామని వివరించారు.

  • Loading...

More Telugu News