credit card: క్రెడిట్ కార్డ్.. క్రెడిట్ లైన్ వేర్వేరు

difference between credit card and crediline

  • క్రెడిట్ కార్డ్ వాడుకుని చెల్లించకపోతేనే క్రెడిట్ రిపోర్ట్ లో చేరుతుంది
  • వాడుకున్నా, వాడుకోకపోయినా క్రెడిట్ లైన్ రిపోర్ట్ లో కనిపిస్తుంది
  • వడ్డీ విధింపులోనూ వ్యత్యాసం

క్రెడిట్ కార్డ్, క్రెడిట్ లైన్ అనేవి ఇప్పుడు చాలామందికి అనుభవంలోకి వస్తున్నవే. అయితే, ఈ రెండింటి మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి. ఈ రెండూ తక్షణ రుణ సదుపాయాలే అయినప్పటికీ వాస్తవానికి వేర్వేరు సాధనాలు. 

క్రెడిట్ కార్డ్ ను ఒక వ్యక్తి ఎక్కడైనా వినియోగించుకోవచ్చు. వినియోగించుకున్నంత మాత్రాన అది రుణం కాదు. రుణ సదుపాయం మాత్రమే. వడ్డీ లేకుండా ఈ సదుపాయాన్ని 45 రోజుల వరకు వినియోగించుకోవచ్చు. నిర్ణీత గడువు లోపు తిరిగి చెల్లించకపోతే అప్పుడు వినియోగించుకున్న మొత్తంపై వడ్డీ, లేట్ ఫీజు పడతాయి. 

క్రెడిట్ లైన్ అలా కాదు. ఫ్లిప్ కార్ట్ పే లేటర్, అమెజాన్ పే లేటర్, బై నౌ పే లేటర్ ఈ తరహా సదుపాయాలన్నీ కూడా క్రెడిట్ లైన్ కిందకు వస్తాయి. వీటిని రుణాలుగా పరిగణిస్తారు. ఈ సదుపాయాన్ని వాడుకుంటేనే వడ్డీ పడుతుంది. వాడుకున్న మొత్తంపై వడ్డీ విధిస్తారు. అయితే, ఈ క్రెడిట్ లైన్ లోనూ కొన్ని సంస్థలు 15-30 రోజుల వరకు వడ్డీ లేకుండా చెల్లించే సదుపాయాన్ని కల్పిస్తున్నాయి.

ఈ రెండింటి మధ్య వడ్డీ విధింపులో వ్యత్యాసం కనిపిస్తుంది. క్రెడిట్ కార్డు వినియోగంపై 20-42 శాతం వరకు వడ్డీ పడితే.. క్రెడిట్ లైన్ పై 16-35 శాతం మధ్య వడ్డీ విధిస్తారు. అంతేకాదు, వీటి చార్జీల్లోనూ వ్యత్యాసం కనిపిస్తుంది. ఇక ఈ రెండు సదుపాయాలకు ఎటువంటి హామీ అవసరం లేదు. 

క్రెడిట్ కార్డ్ వినియోగించుకుని గడువులోపు చెల్లిస్తే క్రెడిట్ రిపోర్ట్ లో కనిపించదు. కానీ, క్రెడిట్ లైన్ అలా కాదు. ఈ సదుపాయం వాడుకున్నా, వాడుకోకపోయినా యాక్టివ్ లోన్ గా కనిపిస్తుంది.

  • Loading...

More Telugu News