Jagan: ఏడాదికి ఎకరాకు రూ. 30 వేలు.. రాయలసీమ రైతులకు జగన్ సరికొత్త ఆఫర్

Rs 30000 for one acre jagan offer to Rayalaseema farmers

  • సోలాల్, విండ్ పవర్ కోసం రాయలసీమ రైతులు భూములివ్వాలన్న జగన్
  • రైతులతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుని విద్యుత్ సంస్థలకు ఇస్తుందన్న సీఎం
  • రైతులను ఒప్పించేలా ఎమ్మెల్యేలు చొరవ చూపాలన్న ముఖ్యమంత్రి

రాయలసీమ రైతులకు ముఖ్యమంత్రి జగన్ సరికొత్త ఆఫర్ ను ప్రకటించారు. సోలార్, విండ్ పవర్ సంస్థల కోసం భూములిచ్చే రైతులకు ఏడాదికి ఎకరాకు రూ. 30 వేల చొప్పున లీజు ధర చెల్లిస్తామని... ఈ మేరకు రైతులతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుందని తెలిపారు. ప్రభుత్వం రైతులతో ఒప్పందం చేసుకుని, సౌర, పవన విద్యుత్ సంస్థలకు ఇస్తుందని చెప్పారు. ప్రతి మూడేళ్లకు ఒకసారి ఐదు శాతం మేర లీజుధరను పెంచుతుందని తెలిపారు. నంద్యాల జిల్లాలో రామ్ కో సిమెంట్స్ పరిశ్రమను జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఆఫర్ గురించి తెలిపారు. 

ఒక్కో లొకేషన్ లో కనీసం 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరిగేలా భూసేకరణ జరగాలని చెప్పారు. ఆ మేరకు రైతులు భూములు ఇచ్చేలా వారిని ఒప్పించేలా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని అన్నారు. ఈ గ్రీన్ గో ప్రాజెక్టుల నిర్మాణాలకు రైతులు కూడా సహకరించాలని కోరారు.

  • Loading...

More Telugu News