YSRCP: విజ‌య‌వాడ టూ బెంగ‌ళూరు వ‌యా క‌డ‌ప‌!... జ‌గ‌న్ ప్ర‌తిపాదిత కొత్త రూట్‌కు ఓకే చెప్పిన గ‌డ్క‌రీ!

union minister nitin gadkari green signal to vijayawada to bengaluru via kadapa route

  • కొత్త ర‌హ‌దారితో విజ‌య‌వాడ‌, బెంగ‌ళూరుల మ‌ధ్య త‌గ్గ‌నున్న 75 కిలోమీట‌ర్ల దూరం
  • 342 కిలోమీట‌ర్ల ర‌హ‌దారికి రూ.13,600 కోట్ల‌ను కేటాయించిన కేంద్రం
  • ర‌హ‌దారికి ఆమోదం తెలిపిన గ‌డ్క‌రీకి కృతజ్ఞ‌త‌లు తెలిపిన కొఠారు అబ్బ‌య్య చౌద‌రి

ఏపీలో మ‌రో కొత్త జాతీయ ర‌హ‌దారికి కేంద్ర ప్ర‌భుత్వం ఆమోద ముద్ర వేసింది. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి స‌మీపంలోని విజ‌య‌వాడ నుంచి క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరుకు క‌డ‌ప మీదుగా ఓ కొత్త ర‌హ‌దారిని ఏర్పాటు చేయాల‌ని ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇటీవ‌లే కేంద్ర ప్ర‌భుత్వానికి ప్ర‌తిపాద‌నలు పంపారు. ఈ ప్ర‌తిపాద‌న‌ల‌ను ప‌రిశీలించిన కేంద్ర ర‌వాణా శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ తాజాగా ఆమోద ముద్ర వేశారు. ఈ మేర‌కు వైసీసీ యువ నేత, ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బ‌య్య చౌద‌రి ఈ వివ‌రాల‌ను ట్విట్ట‌ర్ వేదిక‌గా గురువారం వెల్ల‌డించారు.

విజ‌య‌వాడ నుంచి క‌డ‌ప మీదుగా బెంగ‌ళూరుకు ఏర్పాటు కానున్న నూత‌న ర‌హ‌దారి వ‌ల్ల చాలా ఉప‌యోగాలు ఉన్నాయ‌ని త‌న ట్వీట్‌లో అబ్బ‌య్య చౌద‌రి వెల్ల‌డించారు. ఈ కొత్త ర‌హ‌దారి అందుబాటులోకి వ‌స్తే... విజ‌య‌వాడ, బెంగ‌ళూరుల మ‌ధ్య దూరం 75 కిలోమీట‌ర్ల మేర త‌గ్గుతుంద‌ని తెలిపారు. మొత్తం 342 కిలోమీట‌ర్ల దూరం ఉన్న ఈ ర‌హ‌దారి నిర్మాణానికి రూ.13,600 కోట్ల నిధులు కేటాయింపున‌కు అనుమ‌తి తెలిపిన కేంద్ర మంత్రి గడ్క‌రీకి ఆయ‌న కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

  • Loading...

More Telugu News