Peddireddi Ramachandra Reddy: స్మార్ట్ మీటర్లు పెట్టే వారి చేతులు నరకాలని అనడం దారుణం: ఏపీ మంత్రి పెద్దిరెడ్డి
- రైతులకు నాణ్యమైన విద్యుత్ ను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి
- విద్యుత్ రాయితీని రైతుల ఖాతాకే జమ చేస్తామని వెల్లడి
- స్మార్ట్ మీటర్ల వల్ల రైతులకు ఎలాంటి నష్టం జరగదని హామీ
రైతుల వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తామని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. రైతులకు నాణ్యమైన విద్యుత్ ను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఇప్పటి వరకు 41 వేల విద్యుత్ కనెక్షన్లు ఇచ్చామని... త్వరలోనే 77 వేల కనెక్షన్లు ఇస్తామని చెప్పారు. విద్యుత్ రాయితీ మొత్తాన్ని రైతుల ఖాతాకే జమ చేస్తామని తెలిపారు. స్మార్ట్ మీటర్ల వల్ల రైతులకు ఎలాంటి నష్టం జరగదని చెప్పారు. చంద్రబాబుకు వంత పాడుతున్న జనసేన, కమ్యూనిస్టు నేతలు స్మార్ట్ మీటర్లపై అపోహలను సృష్టిస్తున్నారని మండిపడ్డారు. స్మార్ట్ మీటర్లు పెట్టే వారి చేతులు నరకాలని అనడం దారుణమని అన్నారు. రాజకీయ స్వార్థం కోసం రైతులను అడ్డు పెట్టుకుంటున్నారని చెప్పారు.