Telangana: ఉపాధ్యాయుల ప‌ట్ల ఏపీ ప్ర‌భుత్వం క‌ర్క‌శంగా వ్య‌వ‌హ‌రిస్తోంది: తెలంగాణ మంత్రి హ‌రీశ్ రావు

ts minister harish rao comments on andhra pradesh government over teachers issues

  • సిద్దిపేట‌లో జ‌రిగిన ఉపాధ్యాయ సంఘం స‌మావేశానికి హాజ‌రైన హ‌రీశ్ రావు
  • ఐదేళ్ల కాలంలో 73 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిన రాష్ట్రం దేశంలో ఒక్క తెలంగాణేన‌ని వెల్ల‌డి
  • ఏపీలో ఉపాధ్యాయుల‌పై కేసులు పెట్టి లోప‌ల వేస్తున్నార‌ని వ్యాఖ్య‌

ఏపీలో ఉపాధ్యాయుల ప‌ట్ల ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై తెలంగాణ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గురువారం సిద్ధిపేట‌లో ఉపాధ్యాయ సంఘం స‌మావేశంలో పాల్గొన్న‌ సంద‌ర్భంగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఉపాధ్యాయుల ప‌ట్ల ఏపీ ప్ర‌భుత్వ క‌ర్క‌శంగా వ్య‌వ‌హ‌రిస్తోందని హ‌రీశ్ రావు ఆరోపించారు. అయితే తెలంగాణ‌లో ఉపాధ్యాయుల‌తో త‌మ ప్ర‌భుత్వం స్నేహ‌పూర్వ‌కంగా ఉంటోంద‌ని ఆయ‌న అన్నారు. ఏపీలో ఉపాధ్యాయుల‌పై కేసులు పెడుతున్న ప్ర‌భుత్వం వారిని జైల్లో వేస్తోంద‌ని కూడా హ‌రీశ్ రావు ఆరోపించారు.

ఐదేళ్ల కాలంలో ఉద్యోగుల‌కు 73 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిన రాష్ట్ర ప్ర‌భుత్వం దేశంలో ఒక్క తెలంగాణేన‌ని హరీశ్ రావు అన్నారు. ఇంత మేర ఫిట్‌మెంట్ దేశంలో ఎక్క‌డైనా వ‌చ్చిందా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఏపీలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల ప‌రిస్థితి ఎలా ఉందో గ‌మ‌నిస్తే... తెలంగాణ‌లో త‌మ ప్ర‌భుత్వం ఉద్యోగుల‌తో ఎంత ఫ్రెండ్లీగా ఉంద‌న్న విష‌యం అర్థ‌మ‌వుతుంద‌ని ఆయ‌న అన్నారు.

  • Loading...

More Telugu News