Mohan Bhagwat: ‘హింస’తో కూడిన ఆహార సేవనంతో చెడు మార్గం..: ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్

If you eat wrong food  Mohan Bhagwats advice to non veg eaters

  • తప్పుడు ఆహారం తప్పుడు మార్గంలో నడిపిస్తుందన్న  ఆరెస్సెస్ చీఫ్ 
  •  తామసంతో కూడిన ఆహారాన్ని తీసుకోకూడదన్న భగవత్ 
  • మాంసాహారులు సైతం కొన్ని నియమాలు పాటిస్తారని వ్యాఖ్య  

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ ఆహార సేవనంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరూ తప్పుడు ఆహారం తీసుకోరాదన్నారు. హింసతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం మానేయాలని సూచించారు. భారత్ వికాస్ మంచ్ నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా భగవత్ మాట్లాడారు.

వ్యక్తిత్వ వికాస అంశంపై భగవత్ మాట్లాడుతూ.. ‘‘మీరు తప్పుడు ఆహారాన్ని తీసుకుంటే అది మిమ్మల్ని తప్పుడు మార్గంలోకి నడిపిస్తుంది. తామసంతో కూడిన ఆహారాన్ని తీసుకోకూడదు. హింసతో కూడిన ఆహారాన్ని కూడా తీసుకోరాదు’’ అని భగవత్ సూచించారు. మాంసాహారం తామసం కిందకే వస్తుంది. మాంసాహారం విషయంలో పాశ్చాత్యులు, భారతీయుల మధ్య వ్యత్యాసాన్ని కూడా భగవత్ ప్రస్తావించారు. 

‘‘ప్రపంచంలో ఇతరుల మాదిరే భారత్ లోనూ మాంసాన్ని తినేవారున్నారు. కానీ, మన దేశంలో మాంసాహారులు సైతం తమను కొంత నియంత్రించుకుంటూ, కొన్ని నియమాలను పాటిస్తుంటారు. మన దేశంలో మాంసాహారులు శ్రావణ మాసం మొత్తం దానికి దూరంగా ఉంటారు. సోమవారం, మంగళవారం, గురు లేదా శనివారాలు దాన్ని తీసుకోరు. వారు తమకంటూ కొన్ని నియమాలను పెట్టుకున్నారు’’ అని భగవత్ వివరించారు.  

  • Loading...

More Telugu News