Karan Johar: 'కాఫీ విత్ కరణ్' షోకు తాప్పీని ఆహ్వానించకపోవడానికి కారణం చెప్పిన కరణ్ జొహార్

Karan Johar response on not inviting Taapsee to Koffee with Karan Show
  • ముగిసిన 'కాఫీ విత్ కరణ్' 7వ సీజన్
  • చాట్ షోలో పాల్గొన్న పలు జంటలు
  • తాప్సీకి సెట్ అయ్యే జోడీ దొరికితే తానే ఆహ్వానిస్తానన్న కరణ్  
బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జొహార్ నిర్వహిస్తున్న సెలబ్రిటీ చాట్ షో 'కాఫీ విత్ కరణ్' 7వ సీజన్ ముగిసింది. ఈ సీజన్ 12 వారాల పాటు ప్రేక్షకులను ఎంటర్టయిన్ చేసింది. ఆమిర్ ఖాన్ - కరీనా కపూర్, జాన్వీ కపూర్ - సారా అలీ ఖాన్, అక్షయ్ కుమార్ - సమంత, అలియా భట్ - రణవీర్ సింగ్, విజయ్ దేవరకొండ - అనన్యా పాండే, సిద్ధార్థ్ మల్హోత్రా - విక్కీ కౌశల్ ఇలా పలు జంటలు ఈ షోకు హాజరయ్యాయి. 

మరోవైపు గత రెండేళ్లలో బాలీవుడ్ లో తాప్సీ పలు విజయాలను అందుకుంది. తాప్పీతో పాటు విజయాలను అందుకున్న పలువురు నటీనటులను ఈ షోకు ఇంకా కరణ్ జొహార్ ఆహ్వానించలేదు. ఈ నేపథ్యంలో ఓ కార్యక్రమంలో దీనిపై కరణ్ స్పందిస్తూ... ప్రేక్షకులను అలరించే సెలబ్రిటీ జోడీలను తమ టీమ్ ఎంపిక చేసిందని ఆయన చెప్పారు. తాప్సీకి సెట్ అయ్యే జోడీ దొరికితే ఆమెను స్వయంగా తానే ఆహ్వానిస్తానని అన్నారు. అప్పుడు తన షోకు తాప్పీ రాకపోతే తాను బాధపడతానని చెప్పారు.
Karan Johar
Taapsee
Koffee with Karan Show
Bollywood
Tollywood

More Telugu News