Pakistan: భారత్ లో పాకిస్థాన్ అధికారిక ట్విట్టర్ అకౌంట్ నిలిపివేత

Pakistan governments official Twitter account again withheld in India

  • కారణాలు వెల్లడించని కేంద్రం
  • గతంలోనూ ఈ తరహా చర్యలు
  • ఆగస్ట్ లో యూట్యూబ్ న్యూస్ చానల్స్ పైనా వేటు

పాకిస్థాన్ ప్రభుత్వానికి చెందిన అధికారిక ట్విట్టర్ ఖాతా మరోసారి భారత్ లో నిలిచిపోయింది. పాక్ ప్రభుత్వ అధికారిక ట్విట్టర్ పేజీని తెరిచినప్పుడు.. ‘‘గవర్నమెంట్ ఆఫ్ పాకిస్థాన్ అకౌంట్ హ్యాజ్ బీన్ విత్ హెల్డ్ ఇన్ ఇండియా ఇన్ రెస్పాన్స్ టు ఏ లీగల్ డిమాండ్’’ అనే సందేశం కనిపిస్తోంది. 

గతంలోనూ పాక్ ప్రభుత్వ ట్విట్టర్ పేజీని భారత్ నిలిపివేయగా, తర్వాత తిరిగి యాక్టివేట్ అయింది. ఈ ఏడాది జూలైలో పలు పాకిస్థానీ ట్విట్టర్ హ్యాండిల్స్ పై భారత్ సర్కారు ఇలాంటి చర్యలే తీసుకుంది. చట్టపరమైన డిమాండ్ (కోర్టు ఉత్తర్వులు) ఎదురైనప్పుడు ట్విట్టర్ ఈ విధమైన చర్యలు తీసుకుంటుంది. ఈ ఏడాది జూన్ లో యూఎన్, టర్కీ, ఇరాన్, ఈజిప్ట్ లోని పాక్ ఎంబసీల ఖాతాలను సైతం ట్విట్టర్ ఇండియా నిలిపివేసింది. ఈ ఏడాది ఆగస్ట్ లోనూ 8 యూట్యూబ్ న్యూస్ చానల్స్ ను కేంద్ర సర్కారు బ్లాక్ చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2021లోని నిబంధనల కింద అత్యవసర అధికారాలను ఉపయోగించి ఈ చర్యలు తీసుకున్నట్టు కేంద్ర సమాచార, ప్రసార శాఖ తెలిపింది.

  • Loading...

More Telugu News