Chanakya: ఆరోగ్యానికి చాణక్యుడు చెప్పిన చిట్కాలు..
- సంతృప్తిని మించి సంతోషం లేదు
- లక్ష్యాలను గుర్తించలేకపోతే విజయం రాదు
- ముందు తియ్యగా మాట్లాడి, వెనుక విషం కక్కేవారితో జాగ్రత్త
చాణక్యుడు గొప్ప ఆర్థికవేత్త. క్రీస్తు పూర్వం 350-283 కాలంలో మొదటి మౌర్య చక్రవర్తి అయిన చంద్రగుప్తుని ఆస్థానంలో ఆర్థిక వ్యవహారాలు చూసి కీలకంగా వ్యవహరించారు. ఒక్క ఆర్థిక శాస్త్రమే కాకుండా, రాజనీతి శాస్త్రం, భౌతిక శాస్త్రం, మనస్తత్వ శాస్త్రం, ఇలా ఎన్నింటిలోనో అపార నైపుణ్యాలు కలిగిన మేథావి. అందుకే ఇన్నేళ్ల తర్వాత కూడా ఆయన్ను స్మరించుకుంటున్నాం. చక్కని ఆరోగ్యంతో ఉండేందుకు ఏం చేయాలన్న విషయమై చాణక్యుడు చెప్పిన కొన్ని సూత్రాలు కూడా ఉన్నాయి. కౌటిల్యుడిగానూ పేరు సంపాదించుకున్న వ్యక్తి చాణక్య.
- వినయం అన్నది స్వీయ నియంత్రణకు మూలం.
- మనకంటే తక్కువ లేదా ఎక్కువ స్థాయిలోని వారితో స్నేహం పనికిరాదు. ఈ తరహా స్నేహాలు ఎప్పటికీ సంతోషాన్ని ఇవ్వలేవు.
- పుట్టుకతోనే వ్యక్తి గొప్ప కాలేడు. చేసే పనులే వ్యక్తిని గొప్పగా మారుస్తాయి.
- సంతృప్తికి సమానమైన సంతోషం లేదు. అత్యాశ వంటి వ్యాధి మరొకటి లేదు. స్వీయ నియంత్రణకు మించి సంయమనం లేదు.
- ఈ భూమిపై మూడు రత్నాలే ఉన్నాయి. ఆహారం, నీరు, మృదువైన మాటలు. మూర్ఖులు రాళ్ల ముక్కలను రత్నాలుగా భావిస్తారు.
- సంతోషంగా ఉండాలంటే అనుబంధాన్ని త్యజించాలి.
- లక్ష్యాలను గుర్తించలేని వ్యక్తి విజయం సాధించలేడు.
- ముందు తియ్యగా మాట్లాడి, వెనుక విషాన్ని కక్కేవారికి దూరంగా ఉండాలి.
- వ్యక్తి మరీ అంత నిజాయితీగా ఉండక్కర్లేదు. పొడవాటి చెట్లనే ముందుగా నరుకుతారు. అలాగే, నిజాయితీ పరులే ముందు వేధింపులకు లోనవుతారు.
- ఎంపిక చేసుకునే స్నేహితుల ఆధారంగా వ్యక్తి వ్యక్తిత్వం ప్రతిబింబిస్తుంది.