TDP: హ్యాకింగ్ కు గురైన తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ అకౌంట్

TDP Twitter account has hacked

  • మరో పేరుతో కనిపిస్తున్న టీడీపీ అకౌంట్
  • టీడీపీ అకౌంట్లో విజువల్ ఆర్ట్స్ పోస్టులు
  • హ్యాకింగ్ అంశాన్ని నిర్ధారించిన ఐటీడీపీ
  • త్వరలోనే పునరుద్ధరిస్తామని వెల్లడి

తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్ కు గురైంది. ట్విట్టర్ లో టీడీపీ అకౌంట్ కోసం టైప్ చేస్తే టైలర్ హాబ్స్ (Tyler Hobbs) అనే అకౌంట్ జైటీడీపీ హ్యాండిల్ తో ప్రత్యక్షమవుతోంది. అంతేకాదు, ఆ ఖాతాలో టీడీపీ పోస్టులకు బదులుగా విజువల్ ఆర్ట్స్ కు చెందిన పోస్టులు దర్శనమిస్తున్నాయి. దీనిపై ఐటీడీపీ స్పందించింది. తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ను అధికార వైసీపీ మద్దతు ఉన్న నికృష్టపు శక్తులు హ్యాకింగ్ చేశాయని ఆరోపించింది. త్వరలోనే టీడీపీ అకౌంట్ ను పునరుద్ధరిస్తామని వెల్లడించింది.

  • Loading...

More Telugu News