CM Jagan: అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి హనీ... రూ.1 కోటి మంజూరు చేసిన సీఎం జగన్

CM Jagan grants one crore rupees to Baby Honey who is suffering with rare decease

  • ఇటీవల కోనసీమలో పర్యటించిన సీఎం జగన్
  • ప్లకార్డు ప్రదర్శించిన బాలిక తల్లిదండ్రులు
  • హనీ పరిస్థితి తెలుసుకుని చలించిపోయిన సీఎం
  • చికిత్సకయ్యే ఖర్చు భరిస్తామని హామీ
  • ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వైనం

ఇటీవల సీఎం జగన్ కోనసీమలో వరద బాధితులను పరామర్శించేందుకు పర్యటించడం తెలిసిందే. ఈ సందర్భంగా అరుదైన వ్యాధితో బాధపడుతున్న హనీ అనే చిన్నారి పరిస్థితిని ఆమె తల్లితండ్రులు ప్లకార్డు ద్వారా ప్రదర్శించి సీఎం జగన్ దృష్టిలో పడ్డారు. 

ఎంతో అరుదైన 'గాకర్స్' వ్యాధితో బాధపడుతున్న ఆ చిన్నారి పరిస్థితిని తెలుసుకున్న సీఎం జగన్ చలించిపోయారు. చిన్నారి వైద్యచికిత్సకు అయ్యే ఖర్చు భరిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ... తాజాగా, ఆ బాలిక వైద్యానికి రూ.1 కోటి మంజూరు చేశారు. 

ఈ మేరకు అత్యంత ఖరీదైన ఇంజెక్షన్లను అమలాపురం ఏరియా ఆసుపత్రిలో హనీ తల్లిదండ్రులకు బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అందజేశారు. సీఎం జగన్ ఆదేశాలతో అన్ని చర్యలు తీసుకున్నామని కలెక్టర్ తెలిపారు. బాలిక కుటుంబానికి నెలకు రూ.10 వేల చొప్పున పెన్షన్ కూడా మంజూరు చేస్తున్నామని వెల్లడించారు.

  • Loading...

More Telugu News