Uttar Pradesh: క్లాసులోనే బీర్​ తాగుతూ దొరికిపోయిన టీచర్​.. వీడియో ఇదిగో

Teacher drinking beer while teaching students in UP

  • ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ డీఆర్ బీ ఇంటర్ కాలేజీలో ఘటన
  • ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఇలాగే ఉంటారు అంటూ నెటిజన్ల విమర్శలు
  • విద్యా బుద్ధులు చెప్పాల్సిన వారే ఇలా చేస్తే ఎలాగంటూ విమర్శలు

అతను విద్యార్థులకు మంచి జ్ఞానాన్ని ఇస్తూ, వారికి మార్గదర్శకుడిగా నిలవాల్సిన ఉపాధ్యాయుడు. కానీ పట్టపగలు తరగతి గదిలో విద్యార్థుల ముందే బీర్ తాగుతూ అడ్డంగా దొరికిపోయాడు. ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ డీఆర్ బీ ఇంటర్ కాలేజీలో తాజాగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

అతడి తీరు నచ్చక తోటి సిబ్బందే..
హత్రాస్ డీఆర్ బీ ఇంటర్ కాలేజీలో అసిస్టెంట్ టీచర్ గా పనిచేస్తున్న శైలేంద్ర సింగ్ గౌతమ్ తీరు మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంది. తోటి సిబ్బంది పట్ల కూడా సరిగా ప్రవర్తించడని.. తరగతి గదుల్లోకి బీర్లు తెచ్చుకుని తాగుతాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో అలా తరగతి గదిలో విద్యార్థుల ముందే బీరు తాగుతుండగా తోటి సిబ్బంది వీడియో తీశారు. వీడియో తీయవద్దని, అలా చేస్తే బాగుండదని ఈ సందర్భంగా శైలేంద్ర హెచ్చరిస్తున్న దృశ్యాలు కూడా ఆ వీడియోలో రికార్డయ్యాయి. పక్కనే మరో మహిళా టీచర్ ఉన్నా.. ఏమీ అనకుండా కూర్చుని చూస్తుండటం గమనార్హం. 

  • తర్వాత ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పెట్టగా వైరల్ గా మారింది. కేవలం ఒక్కరోజులోనే 23 వేల మందికిపైగా దీన్ని వీక్షించారు. వందల కొద్దీ రీట్వీట్లు వస్తున్నాయి.
  • ఈ విషయం తెలిసిన యూపీ రాష్ట్ర ప్రభుత్వం సదరు టీచర్ ను సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించింది.
  • ‘మంచి బుద్ధులు, జ్ఞానాన్ని నేర్పాల్సిన టీచర్లే ఇలా చేస్తే.. ఇంక సమాజం ఎటు పోతుంది?’ అంటూ కొందరు కామెంట్లు చేస్తుంటే.. ‘దేశంలో ప్రభుత్వ ఉద్యోగుల తీరుకు ఇది అద్దం పడుతోంది” అని మరికొందరు అంటున్నారు.
  • ఇంకొందరు నెటిజన్లు.. ‘ఏముంది.. ఇప్పుడైతే సస్పెండ్ చేస్తారు. కొద్దిరోజులైతే మళ్లీ వచ్చి బడిలో పాఠాలు చెప్తూనే ఉంటాడు. ప్రభుత్వ ఉద్యోగులకు ఏమవుతుంది’ అని పేర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News