MS Dhoni: టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలవాలంటూ 2011 నాటి హెయిల్ స్టైల్లోకి మారిన ధోని.. వీడియో ఇదిగో
- 2007లో ప్రారంభమైన టీ20 వరల్డ్ కప్
- ధోనీ కెప్టెన్సీలో తొలి టైటిల్ విజేతగా నిలిచిన టీమిండియా
- ఈ దఫా టీమిండియా టీ20 వరల్డ్ కప్‌ను గెలవాలంటూ ధోనీ వినూత్న ప్రచారం
- 2011లో వన్డే వరల్డ్ కప్‌ను గెలిచిన ధోనీ
- ఇప్పుడు నాటి హెయిర్ స్టైల్లోకి మారిపోయిన కెప్టెన్ కూల్
క్రికెట్ లవర్స్ ఎప్పెడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్న టీ20 వరల్డ్ కప్‌కు సమయం ఆసన్నమైంది. ఈ నెల 16న ఆస్ట్రేలియా వేదికగా ఈ మెగా టోర్నీ మొదలు కానుంది. టీ20 వరల్డ్ కప్ తొలి టైటిల్‌ను టీమిండియా గెలిచిన సంగతి తెలిసిందే. 2007లో కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని భారత జట్టు ఈ కప్‌ను గెలుచుకుని సత్తా చాటింది. అయితే ఆ తర్వాత ఒక్కసారి కూడా టీమిండియా ఈ కప్‌ను గెలవలేదు. తాజాగా టీ20ల్లో సత్తా చాటుతున్న భారత జట్టు ఈ దఫా ఎలాగైనా టీ20 వరల్డ్ కప్‌ను గెలవాలంటూ యావత్తు భారతావని కోరుతోంది. అలా కోరుకుంటున్న వారిలో టీ20 వరల్డ్ కప్ తొలి టైటిల్‌ను ముద్దాడిన ధోనీ కూడా ఉన్నాడు.
టీమిండియా జట్టు సగటు వీరాభిమానిలా మారిపోయిన ధోనీ.. టీ20 వరల్డ్ కప్‌ను భారత్ గెలవాలంటూ కోరుతూ ఏకంగా తన పాత హెయిర్ స్టైల్లోకి మారిపోయాడు. 2011లో క్లాసిక్ హెయిర్ స్టైల్లో కనిపించిన ధోనీ... వన్డే వరల్డ్ కప్‌ను గెలిచిన సంగతి తెలిసిందే. తాజాగా అదే హెయిర్ స్టైల్లోకి మారిపోయిన ధోనీ.. టీ20 వరల్డ్ కప్‌ను భారత జట్టు గెలవాలని ఆకాంక్షించాడు. తన హెయిర్ కట్‌ను పాత లుక్కులోకి మార్చుకుంటున్న ధోనీ వీడియో సోషల్ మీడియా వైరల్‌గా మారిపోయింది. ఓ లేడీ హెయిర్ స్టైలిస్ట్‌తో హెయిర్ కటింగ్ చేయించుకున్న ధోనీ... భారత జట్టు ఈ దఫా టీ20 వరల్డ్ కప్‌ను గెలిచి తీరుతుందంటూ చెప్పాడు. ఓరియో బిస్కెట్ల ప్రమోషన్లో భాగంగానే ధోనీ ఈ వీడియోను విడుదల చేశాడు.