YSRCP: త‌ణుకులో జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బ‌ల ప్ర‌ద‌ర్శ‌న‌... ఎడ్ల బండిని తోలిన మంత్రి రోజా

ap minister rk roja participated in bullocks race in tanuku
  • మంత్రి కారుమూరి ఆధ్వ‌ర్యంలో ఎడ్ల బ‌ల ప్ర‌ద‌ర్శ‌న పోటీలు
  • కార్య‌క్ర‌మానికి హాజ‌రైన మంత్రి రోజా
  • ఓ చేత ప‌గ్గాలు, మ‌రో చేత చెర్నాకోల ప‌ట్టి ఎడ్ల బండిని తోలిన మ‌హిళా మంత్రి
ఏపీ ప‌ర్య‌ట‌క శాఖ మంత్రి ఆర్కే రోజా రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్క‌డ ప‌ర్యాట‌క రంగానికి చెందిన కార్య‌క్ర‌మం జ‌రిగినా...వాటికి హాజ‌ర‌వుతున్న రోజా ఆయా కార్య‌క్ర‌మాల్లో ఉత్సాహంగా పాలుపంచుకుంటున్నారు. ఇందులో భాగంగా మంగ‌ళ‌వారం తూర్పు గోదావ‌రి జిల్లా త‌ణుకులో జ‌రిగిన జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బ‌ల ప్ర‌ద‌ర్శ‌న కార్య‌క్ర‌మానికి ఆమె హాజ‌ర‌య్యారు.

రాష్ట్ర పౌర స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి కారుమూరి వెంక‌ట నాగేశ్వ‌ర‌రావు త‌ణుకు ఎమ్మెల్యేగా కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. కార‌మూరి నాగేశ్వ‌ర‌రావు ఆధ్వ‌ర్యంలోనే ఈ ఎడ్ల బ‌ల ప్ర‌ద‌ర్శ‌న జ‌రుగుతోంది. ఈ పోటీల‌కు హాజ‌రైన సంద‌ర్భంగా ఓ చేత ప‌గ్గాలు ప‌ట్టి, మ‌రో చేత చెర్నాకోల ప‌ట్టిన మంత్రి రోజా ఎడ్ల బండిని తొలుతూ ఉత్సాహంగా క‌నిపించారు.
YSRCP
West Godavari District
Tanuku
Roja
Karumuri Venkata Nageswara Rao

More Telugu News