Chiranjeevi: 'గాడ్ ఫాదర్' ఫస్టు డే వసూళ్లు ఎంతంటే!
- నిన్న థియేటర్లకు వచ్చిన 'గాడ్ ఫాదర్'
- స్టైలీష్ లుక్ తో మెప్పించిన మెగాస్టార్
- యాక్షన్ తో కూడిన ఎమోషన్ కి పెద్దపీట
- తొలి రోజునే 38 కోట్లకి పైగా వసూళ్లు
- ప్రధానమైన ఆకర్షణగా నిలిచిన తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్
చిరంజీవి కథానాయకుడిగా రూపొందిన 'గాడ్ ఫాదర్' నిన్ననే థియేటర్లకు వచ్చింది. మలయాళంలో కొంతకాలం క్రితం రికార్డుస్థాయి వసూళ్లను రాబట్టిన 'లూసిఫర్' సినిమాకి ఇది రీమేక్. చిరంజీవి సినిమా అంటేనే పాటలకు .. డాన్సులకు ప్రాధాన్యత ఉంటుంది. అభిమానుల్లో వాటిపై అంచనాలు ఉంటాయి. అయితే తనకి గల ఆ ఇమేజ్ ను పక్కన పెట్టేసి మెగాస్టార్ చేసిన రీమేక్ నే 'గాడ్ ఫాదర్'.
ఎన్వీ ప్రసాద్ - ఆర్ బి చౌదరి నిర్మించిన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లనే రాబట్టింది. తొలి రోజునే ఈ సినిమా 38 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టడం విశేషం. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. చిరంజీవి పాత్రలోని నిబ్బరం .. నయనతార పాత్రలోని నిండుదనం .. సత్యదేవ్ పాత్రలోని స్వార్థం .. సముద్రఖని పాత్రలోని స్త్రీ వ్యామోహం .. ఇలా ప్రతి పాత్రను మోహన్ రాజా తీర్చిదిద్దిన విధానం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది.
ఇది చిరంజీవి చేసిన రెగ్యులర్ సినిమా కాదని ఆడియన్స్ ను ముందుగానే ప్రిపేర్ చేయడం వలన, వాళ్లంతా కేవలం కంటెంట్ పై ఆసక్తితోనే థియేటర్స్ కి రావడంతో వాళ్లను ఈ సినిమా ఆకట్టుకుంది. ఇక తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి ఆరో ప్రాణమని చిరంజీవినే చెప్పారు. సినిమా చూస్తున్నప్పుడు అది నిజమేనని అనిపిస్తుంది. ఈ దసరా సెలవుల్లో ఈ సినిమా ఎంత రాబడుతుందనేది చూడాలి.