Sensex: ఈ వారాన్ని స్వల్ప నష్టాలతో ముగించిన మార్కెట్లు
- 30 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 17 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
- 1.37 శాతం పడిపోయిన ఎం అండ్ ఎం షేర్ విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని స్వల్ప నష్టాలతో ముగించాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల సంకేతాలు ఇన్వెస్టర్లపై ప్రభావాన్ని చూపాయి. అమెరికాలో సెప్టెంబర్ నెల ఉద్యోగ నియామక గణాంకాలు ఈరోజు వెలువడనున్నాయి. ఒక వేళ దీనికి సంబంధించిన డేటా నిరాశాజనకంగా ఉంటే ఫెడ్ రిజర్వ్ కీలక రేట్ల పెంపును మరింత వేగవంతం చేసే అవకాశాలు ఉన్నాయి. దీంతో, ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 30 పాయింట్లు నష్టపోయి 58,191కి పడిపోయింది. నిఫ్టీ 17 పాయింట్లు కోల్పోయి 17,314 వద్ద స్థిరపడింది.
టైటాన్ (5.27%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (1.45%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.06%), ఎన్టీపీసీ (0.95%), మారుతి (0.93%).
మహీంద్రా అండ్ మహీంద్రా (-1.37%), అల్ట్రాటెక్ సిమెంట్ (-1.29%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.28%), టీసీఎస్ (-1.28%), బజాజ్ ఫైనాన్స్ (-0.79%).