Uniform: భారత వాయుసేన సిబ్బందికి కొత్త యూనిఫాం
- ఐఏఎఫ్ రైజింగ్ డే సందర్భంగా విడుదల
- ఆర్మీ యూనిఫాంను పోలి ఉన్న సరికొత్త యూనిఫాం
- నిఫ్ట్ సాయంతో రూపొందించిన వాయుసేన స్టాండింగ్ డ్రెస్ కమిటీ
ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా తట్టుకునే కొత్త యూనిఫాంను భారత వాయుసేన స్టాడింగ్ డ్రెస్ కమిటీ, నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) సంయుక్తంగా రూపొందించాయి. ఈ సరికొత్త యూనిఫాంను భారత వాయుసేన సిబ్బందికి అందించనున్నారు.
మైదానం, ఎడారి, పర్వత ప్రాంతాలు, అడవులు... ఇలా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎలాంటి వాతావరణంలోనైనా ఈ యూనిఫాం ధరిస్తే సౌకర్యవంతంగా ఉంటుందని భారత వాయుసేన చెబుతోంది. భారత వాయుసేన 90వ రైజింగ్ డే ఉత్సవాల సందర్భంగా ఈ యూనిఫాంను అధికారికంగా విడుదల చేశారు.
గతంలో వాయుసేన సిబ్బంది ఉపయోగించిన యూనిఫాంకు ఇది పూర్తి భిన్నంగా ఉంటుంది. ఈ కొత్త యూనిఫాం చాలావరకు ఆర్మీ యూనిఫాంను పోలి ఉంటుంది. దీన్ని తేలికపాటి ఫ్యాబ్రిక్ తో రూపొందించారు.
ఈ సరికొత్త యూనిఫాం కిట్ లో కంబాట్ టీషర్టు, ఫీల్డ్ స్కేల్ డిస్రప్టివ్ టోపీ, కంబాట్ బోనీ హ్యాట్, డిస్రప్టివ్ వెబ్ బెల్ట్, యాంక్లెట్ కంబాట్ షూ, మ్యాచింగ్ టర్బన్ పొందుపరిచారు.