Child Marriages: ఈ రెండు రాష్ట్రాల్లో చిన్నారి పెళ్లికూతుళ్లు ఎక్కువట!

Union govt publish survey on child marriages in country

  • పెళ్లీడు రాకుండానే వివాహాలు
  • 2020లో సర్వే చేపట్టిన కేంద్రం
  • గత నెలలో నివేదిక విడుదల

బాల్య వివాహాలపై కేంద్ర హోంశాఖ ఓ నివేదిక రూపొందించింది. దేశం మొత్తమ్మీద పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల్లోనే బాల్య వివాహాలు అధికమని వెల్లడించింది. ఈ రెండు రాష్ట్రాల్లోని సగం మంది మహిళలు 21 ఏళ్లు రాకముందే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారని వివరించింది. 

21 ఏళ్లకు ముందే పెళ్లికుమార్తెలుగా మారుతున్న వారి శాతం పశ్చిమ బెంగాల్ లో 54.9 కాగా, జార్ఖండ్ లో 54.6 శాతం అని తెలిపింది. 

ఇక 18 ఏళ్లు నిండకుండానే వధువులుగా మారుతున్న బాలికల శాతం (5.8%) జార్ఖండ్ లోనే అత్యధికమని హోంమంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశంలో 18 ఏళ్లకు ముందే వివాహితలుగా మారుతున్న మహిళల శాతం 1.9 కాగా, కేరళలో అది సున్నా శాతం అని వివరించింది. జార్ఖండ్ లోని గ్రామీణ ప్రాంతాల్లో ఈ శాతం 7.3 అని, పట్టణ ప్రాంతాల్లో 3 అని వెల్లడించింది. 

కాగా, ఈ సర్వే 2020లో నిర్వహించగా, నివేదికను గత నెలలో ప్రచురించారు.

  • Loading...

More Telugu News