Vangalapudi Anitha: మహిళలకు రక్షణ కల్పించలేని సీఎం, డీజీపీ ఎందుకు?: వంగలపూడి అనిత

Vangalapudi Anitha fires on AP CM and DGP

  • వైసీపీ పాలనపై అనిత ధ్వజం
  • మహిళా కమిషన్ చైర్ పర్సన్ పై ఆగ్రహం
  • రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఎక్కడుందన్న అనిత
  • కాకినాడ ఘటన ప్రస్తావన

పొలిట్ బ్యూరో సభ్యురాలు, తెలుగు మహిళ ఏపీ అధ్యక్షురాలు వంగలపూడి అనిత వైసీపీ పాలనపై ధ్వజమెత్తారు. శనివారం నాడు ఆమె విలేకరులతో మాట్లాడుతూ... అనంతపురం జిల్లాలో జరిగిన బాలిక ఆత్మహత్య ఘటనను టీడీపీకి ఆపాదించి రాజకీయాలు మాట్లాడిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వీటికి ఏం సమాధానం చెబుతారు? అంటూ నిలదీశారు. 

"గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో వివాహితపై ఆరుగురు గ్యాంగ్ రేప్ చేశారు. దీనిపై బాధిత మహిళ ఫిర్యాదు చేసేందుకు వెళితే స్ధానిక సీఐ ఫిర్యాదు తీసుకోకపోగా, ఆ మహిళను బూతులు తిట్టి మానసిక క్షోభకు గురి చేయటంతో ఆత్మహత్యకు పాల్పడింది. ఎమ్మెల్సీ అప్పిరెడ్డి నిందితుల్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. 

ఆత్మహత్యకు పాల్పడిన మహిళ మృతదేహానికి పోస్టుమార్టం జరుగుతుండగానే కాకినాడలో ప్రేమోన్మాది ఓ యువతిని గొంతు కోసి చంపాడు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఎక్కడుంది? మహిళలకు రక్షణ కల్పించలేని ముఖ్యమంత్రి, డీజీపీ, హోంమంత్రి, మహిళా కమిషన్ ఎందుకు?" అంటూ అనిత నిప్పులు చెరిగారు.

  • Loading...

More Telugu News