Harish Rao: బండి సంజయ్​.. భూతవైద్యం కోర్సులో చేరితే బాగుంటుంది: హరీశ్​ రావు

Harish rao fires on BJP leaders

  • క్షుద్రపూజలు, మంత్రతంత్రాల పేరుతో విష ప్రచారం చేస్తున్నారని మండిపాటు
  • తాంత్రిక విద్యలు ప్రవేశపెట్టింది బీజేపీయేనని విమర్శించిన తెలంగాణ మంత్రి
  • మునుగోడులో బీజేపీ కార్లు, బైకులు పంచి గెలవాలని చూస్తోందని ఆరోపణ

టీఆర్ఎస్ ను రాజకీయంగా ఎదుర్కోలేకనే.. మంత్ర తంత్రాలు, క్షుద్ర పూజల పేరుతో బీజేపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారని తెలంగాణ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. నిజానికి వీటిని ప్రోత్సహించేది బీజేపీయేనని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్ లోని బెనారస్ యూనివర్సిటీలో భూత వైద్యంలో సర్టిఫికెట్ కోర్సును ప్రవేశ పెట్టినది బీజేపీ ప్రభుత్వమేనని చెప్పారు. టీఆర్ఎస్ పై ఆరోపణలు చేస్తున్న బండి సంజయ్ వెళ్లి.. ఆ భూత వైద్యం కోర్సులో చేరితే బాగుంటుందని ఎద్దేవా చేశారు.

మునుగోడులో కార్లు, బైకులు పంచే ప్రయత్నం
మునుగోడు ఉప ఎన్నికల్లో దొడ్డిదారిన గెలిచేందుకు రాజగోపాల్ రెడ్డి, బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని హరీశ్ రావు ఆరోపించారు. ఓట్ల కోసం డబ్బులు పంచడమేగాకుండా 2 వేల కార్లు, 2 వేల బైకులు కొనిచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ నాయకులను సైతం ప్రలోభ పెడుతున్నారన్నారు. బైకులు, కార్లు ఎక్కడి నుంచి తెస్తున్నారో ఆరా తీస్తున్నామని, దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News