Nayanthara: వివాదం నేపథ్యంలో నయనతార భర్త విఘ్నేశ్ శివన్ స్పందన

Nayanthara husband Vignesh Shivan response after surrogacy controvercy
  • సరోగసీ ద్వారా తల్లిదండ్రులైన నయనతార, విఘ్నేశ్
  • నయన్ దంపతులపై వెల్లువెత్తుతున్న విమర్శలు
  • నీ మేలు కోరే వారి గురించే ఆలోచించాలన్న విఘ్నేశ్
సరోగసీ ద్వారా సినీ నటి నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్ తల్లిదండ్రులు కావడం చర్చనీయాంశంగా మారింది. సరోగసీ ద్వారా పిల్లల్ని కనడం చట్ట విరుద్ధం అయినప్పటికీ... ఈ విధానం ద్వారా పిల్లల్ని ఎలా కన్నారంటూ పలువురు విమర్శిస్తున్నారు. ఈ ట్రోలింగ్ నేపథ్యంలో విఘ్నేశ్ శివన్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. 

నిన్ను జాగ్రత్తగా చూసుకుంటూ, నీతోనే ఉంటూ, నీకు అంతా మంచే జరగాలని ఆకాంక్షించే వారి గురించి మాత్రమే ఆలోచించాలని విఘ్నేశ్ అన్నారు. నీ గురించి తపన పడే వాళ్లే నీ వాళ్లు అని చెప్పారు. సమయం వచ్చినప్పుడు అన్నీ నీ వద్దకు చేరుతాయని... అప్పటి వరకు సహనంతో ఉండాలని అన్నారు. జీవితంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలని చెప్పారు.
Nayanthara
Vignesh Shivan
Surrogacy
Tollywood
Kollywood

More Telugu News