Darapaneni Narendra: నరేంద్ర ఆరోపణల్లో వాస్తవం లేదు.. ప్రకటన విడుదల చేసిన సీఐడీ
- తనను హింసించారంటూ న్యాయమూర్తికి ఫిర్యాదు చేసిన నరేంద్ర
- తమపై లేనిపోని అభాండాలు వేస్తున్నారన్న సీఐడీ
- నిందితుడు ఉద్దేశపూర్వకంగానే సాక్ష్యాలు చెరిపేశారన్న అధికారులు
కస్టడీలో తనను తీవ్రంగా కొట్టి హింసించారన్న టీడీపీ మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్ర ఆరోపణలను సీఐడీ అధికారులు విడుదల చేసిన ప్రకటనలో ఖండించారు. ఆయన ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. దర్యాప్తులో భాగంగా చట్టప్రకారం నిందితులను అరెస్ట్ చేసిన సమయంలో వారు తమపై లేనిపోని అభాండాలు వేస్తున్నారని అన్నారు. వాటిలో నిజం లేదన్నారు.
నిందితుడు నరేంద్ర ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగేలా పోస్టులు పెట్టినట్టు దర్యాప్తులో తేలిందన్నారు. నరేంద్ర తన సెల్‌ఫోన్‌లోని సాక్ష్యాలను చెరిపివేసినట్టు గుర్తించామన్నారు. దీంతో ఈ కేసులో 201 సెక్షన్ ను చేర్చి నిందితుడిని అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచామని సీఐడీ తెలిపింది.