Delhi: మాస్కో నుంచి ఢిల్లీకి వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు
- రాత్రి 11.15 గంటలకు బెదిరింపు కాల్
- తెల్లవారుజామున 3.20 గంటలకు ఢిల్లీకి చేరుకున్న విమానం
- బాంబు లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్న వైనం
మాస్కో నుంచి ఢిల్లీకి వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఈ విమానం తెల్లవారుజుమున 3.20 గంటలకు మాస్కో నుంచి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. రాత్రి 11.15 గంటలకు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో తెల్లవారుజామున 2.30 గంటలకు బాంబ్ స్క్వాడ్ సిబ్బంది విమానాశ్రయానికి చేరుకుంది. విమానం ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికులను కిందకు దింపేసి... చెక్ చేశారు. అయితే విమానంలో బాంబు లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బాంబు బెదిరింపులు వచ్చిన సమయంలో విమానంలో 16 మంది క్రూ సిబ్బందితో పాటు 386 మంది ప్రయాణికులు ఉన్నారు. మరోవైపు ఈ బెదిరింపు కాల్ పై ఢిల్లీ దర్యాప్తు చేస్తున్నారు.