Uttar Pradesh: షాపు ముందు బల్బు దొంగతనం చేసిన పోలీస్​

UP cop caught on camera stealing light bulb from roadside shop

  • దసరా ఉత్సవాల సందర్భంగా రాజేశ్ వర్మ అనే కానిస్టేబుల్ కు నైట్ డ్యూటీ వేసిన అధికారులు
  • డ్యూటీలో ఉండగా ఓ షాపు ముందు బల్బును తీసుకుని వెళ్లిపోయిన కానిస్టేబుల్
  • ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో ఘటన.. సస్పెండ్ చేసి విచారణకు ఆదేశం

దొంగల్లో చిన్న చిన్న చోరీలు చేసేవారు.. పెద్ద పెద్ద దోపిడీలకు పాల్పడేవారు ఉంటారు. చిన్నదో పెద్దదో ఏదైనా చోరీనే. అలా చోరీ చేసే దొంగలను పట్టుకునేది పోలీసులు. మరి పోలీసులే దొంగతం చేస్తే.. అది కూడా ఓ చిన్న వస్తువు అయితే.. మరీ దారుణం అనిపిస్తుంది కదా. తాజాగా ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో ఇలాంటి ఘటనే జరిగింది.

రోడ్డు పక్కన షాపు బయట..
ఇటీవల దసరా సందర్భంగా ప్రయాగ్ రాజ్ లో కొద్దిరోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేశ్ వర్మ అనే పోలీస్ కానిస్టేబుల్ కు ఆ ప్రాంతంలో నైట్ డ్యూటీ వేశారు. నైట్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్.. మెల్లగా నడుచుకుంటూ ఓ షాపు వద్దకు వెళ్లాడు. కొద్దిసేపు అటూ ఇటూ తచ్చాడాడు. నేరుగా విద్యుత్ బల్బు ఉన్న చోటుకు వెళ్లాడు. బల్బు తీసుకుని జేబులో పెట్టుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

సీసీ కెమెరాలో చూసి..
మరునాడు తన దుకాణం ముందు బల్బు లేకపోవడం గమనించిన యజమాని.. సీసీ కెమెరా ఫుటేజీని గమనించి ఆశ్చర్యపోయాడు. కానిస్టేబుల్ బల్బు ఎత్తుకుపోయిన విషయాన్ని కొందరికి చెప్పాడు. ఇది పోలీసుల వరకు వెళ్లింది. సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించిన పోలీసు ఉన్నతాధికారులు కానిస్టేబుల్ ను సస్పెండ్ చేసి, విచారణకు ఆదేశించారు.

చీకటి ఉందనే బల్బు తీసుకెళ్లా..
తాను నైట్ డ్యూటీలో ఉన్న ప్రాంతంలో చీకటిగా ఉండటంతో అక్కడ పెట్టేందుకే ఈ దుకాణం బయటి నుంచి బల్బు తీసుకెళ్లానని కానిస్టేబుల్ చెప్పడం గమనార్హం. అంతేకాదు.. అతను కేవలం ఎనిమిది నెలల కిందటే వేరే ప్రాంతం నుంచి ఫూల్పూర్ పోలీస్ స్టేషన్ కు బదిలీపై వచ్చాడని పోలీసులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News