Baba Ramdev: సల్మాన్ ఖాన్ పై బాబా రాందేవ్ సంచలన ఆరోపణలు

Baba Ramdev sensational allegations on Salman Khan
  • సల్మాన్ ఖాన్ డ్రగ్స్ తీసుకుంటాడన్న బాబా రాందేవ్
  • అమీర్ ఖాన్ గురించి తనకు తెలియదని వెల్లడి
  • షారుఖ్ తనయుడు డ్రగ్స్ వాడుతూ దొరికిపోయాడని వ్యాఖ్యలు
  • నటీమణుల గురించి దేవుడికే తెలియాలన్న యోగా గురు
ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ బాలీవుడ్ స్టార్లపై సంచలన ఆరోపణలు చేశారు. బాలీవుడ్ తారల్లో చాలామంది డ్రగ్స్ వాడుతుంటారని వెల్లడించారు. సల్మాన్ ఖాన్ డ్రగ్స్ తీసుకుంటాడని, అమీర్ ఖాన్ గురించి తనకు తెలియదని, కానీ షారుఖ్ ఖాన్ తనయుడు డ్రగ్స్ వాడుతూ పట్టుబడ్డాడని, జైల్లో కూడా ఉన్నాడని బాబా రాందేవ్ వివరించారు. 

నటీమణుల విషయానికొస్తే వారి విషయం దేవుడికే తెలియాలని పరోక్ష వ్యాఖ్యలు చేశారు. చిత్ర పరిశ్రమ చుట్టూ డ్రగ్స్ ప్రపంచం విస్తరించి ఉందని, రాజకీయ రంగంలోనూ మాదకద్రవ్యాలు ఉన్నాయని, ఎన్నికల సందర్భంగా మద్యం పంచడం తెలిసిందేనని బాబా రాందేవ్ పేర్కొన్నారు.

 డ్రగ్ వ్యసనం బారి నుంచి భారత్ కు విముక్తి కల్పించాలని అన్నారు. అందుకోసం ఒక ఉద్యమంలా ముందుకు కదలాలని పిలుపునిచ్చారు. యూపీలోని మొరాదాబాద్ లో నిర్వహించిన ఆర్యవీర్, వీరాంగన సదస్సులలో బాబా రాందేవ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Baba Ramdev
Salman Khan
Drugs
Bollywood

More Telugu News